యువత రాజకీయాల్లోకి రావాలి: శేషుబాబు

అవనిగడ్డ, ప్రజల బాగు కోసం, సమాజ శ్రేయస్సు కోసం, అప్పులు లేని ఆంధ్రప్రదేశ్ కోసం, కుళ్లిపోయిన వ్యవస్థను ప్రక్షాళన చేయటం కోసం, కొత్త తరం యువకులకు రాజకీయ భవిష్యత్ కోసం, నిజమైన సంక్షేమం కోసం పవన్ కళ్యాణ్ రాజకయాల్లోకి వచ్చారని, పవన్ కళ్యాణ్ ఒక్కరే సమాజంను బాగు చేయలేరని, యువత నడుం బిగించి నవ సమాజ నిర్మాణానికి పూనుకోవాలని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు పిలుపు నిచ్చారు. తన తల్లి హాస్పిటల్ లో ఉంటే జనసైనికులు రక్తం ఇచ్చి, ప్రాణం నిలిపారని, సమాజ శ్రేయస్సు కోసం ప్రభుత్వ ఉద్యోగంను వదిలి పార్టీలో చేరిన శేషుబాబు ఆశయ సాధన కోసం తన వంతు కృషి చేయడం కోసం జనసేన పార్టీలో చేరుతున్నట్లు కమ్మిలి రామాంజేయులు తెలిపారు. రామాంజేయులు కు జనసేన నాయకులు ముక్కా శ్రీనివాసరావు కండువా కప్పి, సాదరంగా స్వాగతం పలికారు.