నాయక్ అంటే న్యాయం చేసేవాడు: యుగంధర్ పొన్న

  • భీమ్లా నాయక్ అంటే భవిష్యత్ నాయకుడు అని అర్థం
  • కౌలు రైతులకు అండగా జనసేనాని

గంగాధర నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షల మంది కౌలు రైతులు ఉండగా, కాయ కష్టాన్ని నమ్ముకొని, పండించిన పంటను ఏ విధంగా అమ్ముకోవాలో తెలియక, పంట నష్టం ఏర్పడి, అప్పులపాలై మూడు వేల మంది చనిపోయారు. ఉభయ గోదావరి జిల్లా అనంతపురం జిల్లాలో దాదాపు 150 మంది పైగా చనిపోయారు. వీరందరికీ బాసటగా నిలవాలని జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ముందుకు రావడం చాలా సంతోషకరం, అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంటే, నిమ్మకు నీరెత్తినట్లు ఉంటే పవన్ కళ్యాణ్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఒక కుటుంబానికి ఒక లక్ష రూపాయల చొప్పున ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఇదే కదా నిజమైన ఓదార్పు యాత్ర అంటే. ఇదే కదా దేశభక్తి అంటే, ఇదే కదా దాతృత్వం అంటే, ఇదే కదా సహాయం అంటే, ఇదే కదా చరిత్ర సృష్టించడం అంటే అని జనసేన పార్టీ ఇంచార్జ్ డాక్టర్ యుగంధర్ ఉద్గటించారు. పవన్ కళ్యాణ్ ఏదో ఒక రోజు ముఖ్యమంత్రి అవుతారని అనడం కాదు, ఈ సారే ముఖ్యమంత్రి అవుతారు. ఇందులో డోకా లేదు అని ఆశాభావం వ్యక్తం చేశారు. నాయక్ అంటే న్యాయం చేసేవాడు, భీమ్లా నాయక్ అంటే భవిష్యత్ నాయకుడు అని అర్థం అని తెలిపారు. ఉన్నతమైన వ్యక్తులతో నే వ్యవస్థలో ఉన్నతమైన మార్పులు సంభవిస్తాయి. ఆ ఉన్నతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్, ఆ ఉన్నతమైన వ్యవస్థ జనసేన పార్టీ అని కొనియాడారు.