ఆధారం లేని మహిళ కు ఇంటి నిర్మాణం నిమిత్తం ఆర్థిక సాయం అందించిన అనపర్తి జనసేన
అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం, రామేశ్వరం గ్రామంలో ఏ ఆధారం లేని మహిళ కు ఇంటి నిర్మాణం నిమిత్తం రామేశ్వరం జనసైనికుల సహకారంతో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జీ మర్రిరెడ్డి శ్రీనివాస్ చేతులు మీదుగా 10,000 రూపాయలు సహాయం చేయడం జరిగింది.. అలాగే రామేశ్వరం జనసేన ఎంపీటీసీ మద్దూరి సూరిబాబు ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే ఇటుకలు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు వీరస్వామి, జడ్పిటిసి అభ్యర్థి కాశి రాణి, గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు ఏసు, తోటకూర వెంకట రమణ, నాగిరెడ్డి శ్రీనివాస్, కోలా శ్రీను, గణపతి అనేకమంది గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-04-at-8.20.57-PM-1024x576.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/04/WhatsApp-Image-2022-04-04-at-8.20.58-PM-1024x770.jpeg)