విద్యుత్ చార్జీల పెంపుపై భగ్గుమన్న జనసేన వీర మహిళలు

*విద్యుత్ చార్జీల పెంపుని నిరసిస్తూ నిరసన ర్యాలీ చేపట్టిన వీరమహిళలు

*వైసీపీ ప్రభుత్వంలో సామాన్యుడి జీవితం ఛిద్రమైపోతుంది అంటూ ఆవేదన వ్యక్తం చేసిన జనసేన

విద్యుత్ చార్జీల పెంపుని నిరసిస్తూ గురువారం గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి పొన్నూరు రోడ్డులోని విద్యుత్ భవన్ వరకూ జనసేన వీరమహిళలు నిరసన ర్యాలీ చేపట్టారు. కరెంట్ చార్జీలను వెంటనే తగ్గించాలంటూ విద్యుత్ భవన్ ను వీర మహిళలు చుట్టుముట్టారు.. ఈ సందర్భంగా జనసేన శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.. విద్యుత్ యస్. ఈ వచ్చేదాకా కదిలేది లేదంటూ పెద్దఎత్తున వీరమహిళలు నినాదాలు చేశారు… కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం అనంతరం విద్యుత్ డీ.ఈ బయటికి రావటంతో.. విద్యుత్ చార్జీల పెరుగుదలతో సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదని, పెరిగిన విద్యుత్ చార్జీలను తక్షణమే తగ్గించాలంటూ.. జనసేన జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి షేక్ నాయబ్ కమాల్, నగర అధ్యక్షుడు నెరేళ్ల సురేష్ సమక్షంలో వీర మహిళలు విద్యుత్ డీ.ఈ కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు, జనసేన శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

This image has an empty alt attribute; its file name is WhatsApp-Image-2022-04-07-at-5.11.37-PM-1-1024x461.jpeg