అంబటి, పేర్ని నానిలు మంత్రి పదవి కోసమే జనసేనాని పై విమర్శలు చేస్తున్నారు: వాసగిరి మణికంఠ

రైతు భరోసా వైసీపీ ప్రభుత్వం ఎవడబ్బ సొమ్ము తో ఇస్తోంది, ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చి గొప్పలు చెబుతుంటే, మా నాయకుడు తన కష్టార్జితం 5 కోట్లు రైతులకు పంచడానికి ముందుకు వచ్చాడు. అదే మా నాయకుడికి మీకు ఉన్న తేడా అని అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ అంబటి రాంబాబు పై విరుచుకు పడ్డారు.

వైసీపీ నాయకులు కోట్లు కోట్లు స్కాంలు చేసి సంపాదించడం తప్ప ఏరోజైనా కష్టపడిన డబ్బుల్ని ప్రజల కోసం ఉపయోగించారా, మీకు సిగ్గు ఉంటే ఇలా మాట్లాడవు అంబటి రాంబాబు. పవన్ కళ్యాణ్ గారు కష్టపడిన సొమ్ము తో ప్రజలకు సేవ చేస్తున్నారు, ఆ పని మీ ప్రభుత్వానికి చేతకాదు, చేసే వారి మీద బురద చల్లడం తప్ప. దండం పెడతాం రాష్ట్రాన్ని నాశనం చేయడానికి మానేయండి అని హెచ్చరించారు.

మేము మీ కంటే ఎక్కువ మాట్లాడగలం.. మీ ప్రభుత్వంతో మొదట మీరు పనులు చేయించండి. పోలవరం పూర్తికాలే, కాలనీ ఇల్లులు ఎక్కడ, ఒక్క రోడ్డు వేయలేదు, రైతులకు సబ్సిడీపై పనిముట్లు లేవు, రైతులకు వ్యవసాయ కరెంటు సర్వీసులు లేవు, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, చెత్త పన్ను పెంచారు, ఆస్థి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ ని పెంచేశారు, నేడు కరెంట్ చార్జీలు పెంచేశారు, మనిషి కొనుగోలు శక్తిని నిలువునా చంపేస్తున్నారు.. సంపద సృష్టించలేదు సరికదా.. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. ఏదో పొడిచిన వారిలా ఎగిరి మాట్లాడుతున్నావు, కొంచెం వెనక చూసుకో అని వాసగిరి మణికంఠ అంబటిని విమర్శించారు.

సంక్షేమ పథకాలు అమలు చేయడం వల్లే కరెంట్ చార్జీలు పెంచాల్సి వచ్చింది, కరెంట్ కోతలు పెట్టాల్సి వచ్చింది అని మీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి వ్యాఖ్యానించారు.

అదే కాదు ఈ అప్పులు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోవడం, ప్రభుత్వ భూములు అమ్మేయడం, రోడ్లు కూడా వేయలేకపోవడం, కరెంట్ కష్టాలు వగైరా వగైరా అన్ని సమస్యలకు అర్థం పర్థం లేని జగన్ ఉచిత పథకాలే కారణం ప్రజలు అనుకుంటున్నారు.

ఇప్పటిలో.. రాష్ట్రం కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు, పెరిగిన రేట్లు, గుంతల రహదారులు, కరెంట్ కష్టాలను ప్రజలు ప్రభుత్వం మారినా కూడా కొన్ని ఏళ్ళు భరించకతప్పదు అంతలా డ్యామేజీ చేశారు మీ పరిపాలనలో.

పతివ్రత పరవాన్నం వండితే రెండు రోజులైనా చల్లార లేదంట అట్ల ఉంది అంబటి రాంబాబు పరిస్థితి… సొల్లు ఆపి పని చూడు. రాంబాబు,పేర్ని నాని., నా మాట విని మీరు ఇంకొక పార్టీ చూసుకొండి నెక్స్ట్ నీ పార్టీ అధికారంలోకి రాదు, నీకు మంత్రి పదవి అంతకన్నా రాదు అని వాసగిరి మణికంఠ ఘాటుగా వ్యాఖ్యానించారు.