ముఖ్యమంత్రులతో ప్రధాని కాన్ఫరెన్స్…

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా పరిస్థితిపై ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ రోజు  అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలోని ఏడు రాష్ట్రాల్లోనే కరోనా ఉదృతి అధికంగా ఉన్నది. కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. కరోనా పరిస్థితిపై సమీక్షించి, కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై వారితో చర్చించారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, ఉత్తర ప్రదేశ్‌, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్‌ రాష్ట్రల్లో నమోదు కావడంతో ప్రధాని మోదీ ఆయా రాష్ట్రాల సీఎంలతో ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు.