అగ్నిప్రమాద బాదితులను ఆదుకున్న బిక్కవోలు జనసేన

అనపర్తి నియోజకవర్గం, బిక్కవోలు మండలం, కొత్తపేటలో దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదంలో ఇల్లు మొత్తం కాలిపోయి అందులో ఉండే రెండు కుటుంబాల వస్తువులు సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతి అయిపోయాయి. సర్వం కోల్పోయిన ఆ కుటుంబాలను పరామర్శించి. ఆ రెండు కుటుంబాలకు ప్రస్తుత అవసరాల కోసం ఒక్కొక్కరికి 3000 వేల చొప్పున 6000 రూపాయలు, అలాగే ఆ ఇంట్లో నే నివాసం ఉంటున్న ఒక వృద్ధురాలికి.. రైస్, నిత్యావసర సరుకుల నిమిత్తం 1000 రూపాయాలను జనసేన పార్టీ ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్, మండల అధ్యక్షులు ఇందల వీరబాబు, జనసైనికులు నూతంగి శ్రీనివాస్, గోవిందరాజులు, శ్రీనివాస్, కర్రి శ్రీను అందించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వం వారిని అన్ని విధాలా ఆదుకునే విధంగా.. ప్రయత్నం చేస్తాము అని హామీ ఇవ్వడం జరిగింది.