ధర్మారెడ్డి బదిలీతోనే టిటిడి బాగుపడుతుంది: జనసేన

*జనసేనాని ని విమర్శించిన మంత్రుల పదవులకు ఎసరు
*జగన్ చెబితే మీరు చేస్తారేమో.. మా పవన్ కళ్యాణ్ చెప్పకనే మేం చేస్తాం.

తిరుపతి, వైసిపి సామ్రాజ్య పాలనలో వారి విఐపిలకు శ్రీవారి దర్శనాలు కల్పించే దాంట్లో నిమగ్నమై ఈనెల 12వ తేదీ మంగళవారం సామాన్య భక్తులకు టోకెన్లు కట్టుకునే సదుపాయం ప్రకటించి, వారికి సరైన భద్రత లేకుండా తొక్కిసలాట జరగడానికి కారకులైన టీటీడీ ఈవో ధర్మారెడ్డిని వెంటనే బదిలీ చేయాలని… అలాగే పాలకమండలి సభ్యులు రాజీనామా చేయాలని… జనసేన పార్టీ తిరుపతి అసెంబ్లీ ఇన్చార్జి కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. స్థానిక ప్రెస్క్ల క్లబ్ లో బుధవారం మీడియాతో జనసేన నగర అధ్యక్షుడు రాజారెడ్డి, ఉపాధ్యక్షుడు బాబ్జి, జిల్లా నాయకులు రాజేష్ యాదవ్, హేమ కుమార్, ప్రధాన కార్యదర్శులు సుమన్ బాబు, కోకిల మరియు కిరణ్ తదితరులతో కలిసి వారు మాట్లాడుతూ మంగళవారం జరిగిన దర్శన టోకెన్ల ఘటనలో జరిగిన బాధాకర తొక్కిసలాట తర్వాత టీటీడీ కళ్ళు తెరుచుకుని సర్వదర్శనం ప్రకటించడం సిగ్గుమాలిన చర్య అన్నారు, వైసిపి విఐపిలకు రోజుకు అర్థగంట కేటాయించి మిగతా సమయాన్ని సామాన్య భక్తులకు పూర్వం వలె సర్వదర్శనం కొనసాగించి ఉంటే దేశ నలుమూలల నుండి శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే వారు ఇలా ఇబ్బంది పడి ఉండరని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు రోజులు భక్తులు దర్శనం కోసం వేచి ఉండాల్సి వస్తే వారు తెచ్చుకున్న సొమ్ము ఖాళీ అయ్యి కుటుంబ సమేతంగా రోడ్లపై పడుకుంటూ బాధలు పడుతున్నారన్నారు ధర్మరెడ్డికి ముందు జాగ్రత్త లేదా అని ప్రశ్నించారు. చదువు లేని వారు కూడా రోజుకి 50 వేల మందికి పైగా గతంలోలా ఫ్రీ దర్శనాన్ని ప్రశాంతంగా చేసుకోవచ్చు అన్న జ్ఞానం కలిగి ఉన్నారని ఐఏఎస్ స్థాయి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఇలా వ్యవహరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనాని ని నిందిస్తే మంత్రి పదవుల్ని సీఎం జగన్ ఇస్తానన్న ఆశ నేడు వారికి అడియాస అయిందని, వైసిపి వాడుకుంటుందని విమర్శించారు, కొత్త, పాత మంత్రులు ఒక్కొక్కరు నూరు మందితో దర్శనానికి వస్తామని టిటిడి కి హుకుం జారీ చేయడం వలనే నేడు వీఐపీల ఏర్పాట్లలో మునిగిన పాలకమండలి సామాన్య భక్తులను మరచి ఈ తొక్కిసలాటకు కారణమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.