ప్రమాదవశాత్తు చెయ్యి విరగిన వ్యక్తికి ఆర్ధికసాయం

ప్రకాశం జిల్లా, గిద్దలూరు నియోజకవర్గం కంభం గ్రామంలో యడవల్లి వెంకటమ్మ భర్త పెద్ద వీరయ్యకి ప్రమాదవశాత్తు చెయ్యి విరగడం జరిగినది. వైద్యం చేయించుకొనుటకు ఆర్ధిక ఇబ్బందులు సహకరించకపోవడంతో, ఆ విషయం తెలుసుకున్న జనసేన పార్టి నాయకులు జనసేన పార్టీ ఇంచార్జీ బెల్లంకొండ సాయిబాబు అదేశాల మేరకు వైద్య సహాయం కొరకు ఆర్ధిక సహాయం అందించడం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాశం జిల్లా కార్యదర్శి లంకా నరసింహారావు, జిల్లా సంయుక్త కార్యదర్శి కాల్వ బాల రంగయ్య, కంభం మండల అధ్యక్షులు తాడిశెట్టి ప్రసాద్, షేక్ హాజ్మతుల్ల, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.