నీరు లేక ఎండిపోతున్న పంట పొలాలు

  • దిక్కు తోచని స్థితిలో పెడన నియోజకవర్గ రైతాంగం
  • అడ్రస్ లేని మంత్రి జోగి రమేష్
  • చేతులెత్తేసిన ఇరిగేషన్ అధికారులు
  • తీవ్ర మనోవేదనకు గురవుతున్న రైతులు

పెడన నియోజకవర్గం: పెడనలో ఆగస్టు నెలలో కురిసిన వర్షాలకు చెరువులను తలపించిన పంట పొలాలు నేడు ఎడారిని తలపిస్తున్నాయని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక పంట పొలాలు పరిశీలించిన ఎస్ వి బాబు విలేకరులతో మాట్లాడుతూ ఆగస్టులో కురిసిన వర్షాలతో నిండా మునిగిన రైతు తమ పంట పొలాల్లో నీరుని బయటకు తోడుకున్నారు. అదే రైతులు ప్రస్తుతం తమ పంట పొలాల్లోకి ఇంజిన్ లో నీళ్లు తోడుకోవడానికి పంట కాలవల్లో నీళ్లు లేని పరిస్థితి. వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టినాక కృష్ణ డెల్టా పరిస్థితి ప్రశ్నార్ధకంగా మారింది. అతివృష్టి అనావృష్టితో రైతు సతమతమవుతున్నాడు. భారీ వర్షాలకు పంటలు మునిగిపోవడానికి గాని, ప్రస్తుతం నీటి ఎద్దడికి గాని ముఖ్య కారణం స్థానిక ఎమ్మెల్యే మరియు మంత్రి అయినా జోగి రమేష్ అక్రమ మట్టి తవ్వకం మీద పెట్టిన శ్రద్ధ కాలవల తవ్వకం పై పెట్టకపోవడమే ప్రధాన కారణం. గత నాలుగు సంవత్సరాల నుండి పంట కాలువలో గాని, మురుగు కాలువలో గాని తట్ట మట్టి తీసిన దాఖలాలు లేవు. నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు తన నోటి పారుదలపై పెట్టిన శ్రద్ధ శాఖపై పెట్టకపోవడం వల్ల కృష్ణ డెల్టా రైతులు తీవ్ర సాగునీరు ఎద్దడను ఎదుర్కొంటున్నారు. సదరు మంత్రి పవన్ కళ్యాణ్ గారి సినిమా రివ్యూల మీద పెట్టిన శ్రద్ధ నీటిపారుదల శాఖపై పెట్టకపోవడం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చేసుకున్న పాపం. కృష్ణాజిల్లా ఇన్చార్జి మంత్రి అయినా రోజా తన మేకప్ పై పెట్టిన శ్రద్ధ కృష్ణాజిల్లా సమస్యల పైన రైతాంగం సమస్యల మీద దృష్టి పెట్టకపోవడం మంత్రుల పనితీరుకు నిదర్శనం. ఇలాంటి మంత్రులు మా కొద్దు అంటూ ఆంధ్ర రాష్ట్ర రైతాంగం ముక్తకంఠంతో చెబుతుంది.రాబోయే ఎన్నికల్లో వైసిపి మంత్రులను, ఎమ్మెల్యేలను ఇంటికే పరిమితం చేస్తామని రైతాంగం ప్రతిజ్ఞ పూనుతున్నారు. తక్షణమే నీటిపారుదల అధికారులు స్పందించి పెడన నియోజకవర్గం రైతులకు నీటిని విడుదల చేయవలసిందిగా జనసేన పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం.లేని పక్షాన రైతు పక్షాన నిలిచి ఎలాంటి ఉద్యమానికైనా సిద్ధమని ఎస్ వి బాబు పేర్కొన్నారు.