నిరుపేద మహిళ వివాహానికి జనసేన ఆర్ధికసాయం
విశాఖపట్నం, గాజువాక నియోజకవర్గం, 88 వ వార్డు యాదవ్ జగ్గరాజు పేట గ్రామంలో గత 20 సంవత్సరాల నుంచి సుకన్య ఇద్దరు కుమార్తెలతో జీవనం సాగిస్తూ మొదటి కుమార్తె సరిత వివాహాం చెయ్యడానికి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ గుర్తించి, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో జనసేన కుటుంబంగా భావించి సోదరి వివాహానికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు వబ్బిన జనార్దన శ్రీకాంత్ వారి కుటుంబంతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో ఒక సోదరిగా మీకు మా వంతు బాధ్యతగా సహాయం చేయడం జరిగిందని, భవిష్యత్లో మీకు ఎటువంటి అవసరం ఉన్నా మీకు జనసేన కుటుంబం ఉందని మర్చిపోవద్దని మీకు ఎల్లవేళలా తోడుగా ఉంటాము అని భరోసా ఇవ్వడం జరిగింది, ఈ యొక్క కార్యక్రమంలో చిన్న, అశోక్, చలం, ఉపేంద్ర, కన్నారావు, జీవన్, బాలు, హేమంత్, గోపి, శ్రీను, నాయుడు మరియు జనసైనికులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/05/WhatsApp-Image-2022-05-11-at-8.38.24-AM-1-1024x768.jpeg)