ఎమ్మెల్సీ అనంతబాబు ని తక్షణమే అరెస్టు చేయాలి

కాకినాడ, ఎంతో భవిష్యత్తు ఉన్న దళిత యువకుడిని అన్యాయంగా చంపేశారు. జరిగింది ఒకటైతే కట్టు కథ అల్లి కేసును తప్పుదోవ పట్టిస్తూ వైసిపి ప్రజాప్రతినిధిని కాపాడే విధంగా పోలీసులు వ్యవహరించడం దారుణం. ప్రభుత్వం దిగివచ్చి కుటుంబానికి న్యాయం చేసే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని జనసేన పార్టి పిఏసి సభ్యులు పంతం నానాజి, ముత్తా శశిధర్, సిటి ప్రెసిడెంట్ సంగిశెట్టి అశోక్ మరియు జిల్లా కార్యదర్శి సత్య అన్నారు.