కసుమర్రు జిల్లాస్థాయి క్రికెట్ విజేతలకు ట్రోఫీ అందజేసిన గాదె

పొన్నూరు నియోజకవర్గం, కసుమర్రు గ్రామంలో జరిగిన జిల్లాస్థాయి క్రికెట్ టోర్నమెంట్ ట్రోఫీ అందజేసే కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఫైనల్లో విజయం సాధించిన బాపట్ల బ్లాస్టర్స్ టీం కు మొదటి బహుమతిగా ట్రోపి మరియు 15000 నగదు, రన్నర్ గా నిలిచిన నగరం జట్టుకు ట్రొపి మరియు 10000 నగదును పొన్నూరు నియోజకవర్గం జనసేన పార్టీ ద్వారా జిల్లా గాదె చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాల రావు గారు, జిల్లా కార్యవర్గ సభ్యులు తాళ్లూరి అప్పారావు, ప్రసాద్, మేకల యాదవ్, దేశంశెట్టి సూర్య, పొన్నూరు మండల అధ్యక్షుడు నాగి శెట్టి సుబ్బారావు, మండల కార్యవర్గ సభ్యులు, కసుకర్రు గ్రామ అధ్యక్షుడు యలవర్తి వెంకటేశ్వర్లు, పొన్నూరు టౌన్ నాయుకులు యర్ర సాని నాగభూషణం మరియు జనసైనికులు పాల్గొన్నారు.