రాయపాటి అరుణ ని సత్కరించిన పిఠాపురం జనసేన

ఒంగోలు పార్టీ ఆఫీసులో జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పుణ్యమంతుల సూర్యనారాయణ మూర్తి, యండ్రపు శ్రీనివాస్, నమ శ్రీకాంత్, ఈ సందర్భంగా మూర్తి మాట్లాడుతూ జనసేన పార్టీ ఆడపడుచు అయినటువంటి అధికార ప్రతినిధి అరుణ ప్రత్యర్థి పార్టీలకు దీటుగా ఎన్కౌంటర్ల మాటలతో సమాధానం ఇస్తూ మీ మాటల తూటాలను జోహార్ అంటూ అభినందించారు. అలాగే అధికార ప్రతినిధి అరుణ మాట్లాడుతూ తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం నుంచి పార్టీ నాయకులు వచ్చి అభినందించటం చాలా ఆనందంగా ఉంది ఇదంతా నాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఒక వరం అని తెలియజేశారు.