యువ హీరోగా పరిచయం అవుతున్న కొట్టె మల్లికార్జున

*స్వయం కృషి తో నటుడిగా అరంగ్రేటం, ప్రత్యేక గుర్తింపు తో యువ హీరోగా పరిచయం అవుతున్నకొట్టె మల్లికార్జున {అర్జున్}

గ్రామీణ నేపథ్యంతో విద్యాభ్యాసం పూర్తి చేసి.. గ్రూప్స్ మరియు సివిల్స్ సాధించాలని హైదరాబాద్ కు వచ్చి, ఒకవైపు సివిల్స్, గ్రూప్స్ కు ప్రిపేర్ అవుతూ.. తనకిష్టమైన సినిమా రంగంలో ప్రయత్నం చేస్తూ.. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ.. ప్రత్యేక గుర్తింపుతో నటుడి నుంచి హీరోగా పరిచయం కాబోతున్న కొట్టె మల్లికార్జున్. కృషి , పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించవచ్చు “కృషితో నాస్తి దుర్భిక్షం” అని నిరూపించారు. తొలిసారి హీరోగా నటిస్తున్నటువంటి “డెమో ఫిల్మ్ “లైఫ్ “మూవీకి సంబంధించిన పోస్టర్ కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా యువ హీరో కొట్టె మల్లికార్జున్ మీడియాతో మాట్లాడుతూ.. పెద్దలు కిషన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఆయన చేతుల మీదుగా పోస్టర్ విడుదల కావడం అదృష్టంగా భావిస్తున్నాను మరియు నాకు దక్కిన గౌరవం గా అనుకుంటున్నాను. దీనికి సహకరించిన పెద్దలు గౌతమ్ అన్న గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు, నన్ను అభిమానించే మిత్రులకు, ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పడం జరిగింది. రోమ్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద అమ్మ సెంటిమెంట్ తో.. అన్ని రకాల ఎలివేషన్స్ తో నిర్మించబడినటువంటి ” లైఫ్ చిత్రం” లో హీరోగా అవకాశాన్ని కల్పించిన యువ డైరెక్టర్ కళ్ళఅర్జున్ కు, నిర్మాతలు రాజ్ గోపాల్, సుజాతగార్లకు, కెమెరామెన్ రవికె రెడ్డి, దామోదర్, హీరోయిన్ మేఘ, అనిల్, ఎంపీరెడ్డి, ఆమని, ఇతర నటీనటులకు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేసి, ఈ చిత్రాన్ని ఓ.టి.టీ మరియు యూట్యూబ్లో విడుదల తేదీ ఖరారు చేసి మీడియా మిత్రులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. భవిష్యత్ లో మంచి కుటుంబ, సందేశాత్మక చిత్రాల్లో నటిస్తూ.. ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో పాటు.. యువ రాజకీయ నాయకుడిగా నన్ను ఆదరిస్తున్న ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తూ.. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ.. ప్రజాక్షేత్రంలో కూడా విజయం సాధించి.. ఎంతో మందికి స్ఫూర్తిగా ఆదర్శంగా నిలుస్తాను అని పేర్కొన్నారు.