నూటికో కోటికో ఒక్కరు పుడతారు.. అది పవన్ కళ్యాణ్..!!

ఇది ఒక యదార్దాగాధ.. కల్పితం కాదు.. మనం జీవించి ఉన్న ఈ కాలంలోనే 2000 సంవత్సరంలో మన పక్కనే జరిగిన వాస్తవ సంఘటన

మణిపూర్ ఉక్కు మహిళగా, సామాజిక కార్యక్రమాలు, మానవ హక్కుల కార్యకర్తగా, కవయిత్రిగా ఐరోమ్ షర్మిల పేరు గత దశాబ్దం లో మీరు వినేవుంటారు.

చట్టాన్ని అడ్డుపెట్టుకుని 2000 సంవత్సరంలో 10 మంది అమాయకులను సైనికులు కాల్చి చంపడాన్ని కళ్లారా చూసి నిరాహారదీక్షకు దిగారు.. సాయుధ బలగాలకు విశేష అధికారాలను కట్టబెట్టే చట్టాన్ని తొలగించాలని పోరాటానికి దిగారు.. ప్రభుత్వం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారని అరెస్టు చేసింది.. అప్పుడు ఆమె వయస్సు 27 సంవత్సరాలు.. ఇంఫాల్ ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేక వార్డునే సబ్ జైలుగా మార్చి ముక్కుకు అమర్చిన ట్యూబ్ ద్వారా బలవంతంగా ద్రవరూపంలో.. ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్లూయిడ్స్ ఇస్తుండేవారు. డాక్టర్స్.. ముక్కుకి అమర్చిన ట్యూబ్ తోనే కోర్ట్ కి అటెండ్ అయ్యేది.. దీక్ష విరమిస్తారా అని ఎన్నో సార్లు జడ్జి గారు అడిగితే నో అనే చెప్పేది.. అలా 14 సంవత్సరాలు పోరాడింది.. ఆమె మద్దతుదారులు రాజకీయాల్లోకి వస్తే ప్రస్తుత పరిస్థితి మారుతుందని.. నిరసన దీక్షతో ఫలితం రావడం లేదని ఆమెను ఒప్పించారు. కోర్ట్ కూడా ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించారనటానికి ఆధారాలు లేవని విడుదల చెసింది.

బయటకు వచ్చి షర్మిల.. ఆప్ నుంచి వచ్చిన ఆహ్వానాన్ని తిరస్కరించి అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చూస్తున్నానని, పెళ్లి కూడా చేసుకోబోతున్నానని, తమ డిమాండ్స్ ప్రభుత్వం నెరవేర్చలేదని విఫలం చెందిందని, అందుకే ఎన్నికల్లో పోటీ చెసి సమస్య పరిష్కారించేందుకు నిర్ణయించుకున్నట్లు చెప్పింది.

ఎవరికోసమైతే నిండు యౌవవం లో 16 సంవత్సరాలు ఉద్యోగం, ప్రేమ, పెళ్లి కాదనుకొని అన్నీ వదిలేసి మణిపూర్ ప్రజలకోసం ఫేక్ ఎన్కౌంటర్ లపై సుదీర్ఘ పోరాటం చేసిన ఆమెకు 2017 ఎన్నికల్లో ప్రజలు మద్దతుగా వేసిన ఓట్లు ఎన్నో తెలుసా? అక్షరాలా 90 ఓట్లు..

2019 లో ఈ వ్యవస్థలమీద నమ్మకం కోల్పోయి ఇక జీవితంలో డర్టీ పాలిటిక్స్ లో పోటీచేయనని ప్రకటించి ప్రశాంత జీవితం కోసం భర్త, పిల్లలతో బెంగళూరులో గడుపుతోంది ప్రస్తుతం..

దీనికి కారణం ఎవరు?? గుర్రం.. గాడిద ఒకటే అనుకుని.. మన కళ్ళ ముందు కనబడుతున్న దానిలో ఏది మంచో.. ఏది చెడో.. తెలుసుకునే ఆసక్తి లేక డబ్బు, మధ్యం కి, మరో కారణం వెతుక్కునో అమ్ముడుపోయి.. మంచి చేద్దామని వచ్చి.. నిరూపించుకున్నవారికి సపోర్ట్ చేయని.. ఓటు వేసి గెలిపించుకోలేని వారే అతి పెద్ద అవినీతిపరులు ఈ సమాజంలో.

గతంలో.. ఒక జయప్రకాష్ నారాయణ, ఒక చిరంజీవి ఇలానే వచ్చారు.. మంచి రాజకీయాలు చేద్దామనుకునే వారికి మీ మద్దతు లభించక.. డర్టీ రాజకీయాలలో ఇమడలేక.. చూసి విసిగి నిరాశక్తితో రాజకీయాల నుంచి నిష్క్రమించారు.. నూటికో కోటికో ఒక్కరు పుడతారు.. ఇలాంటి నిస్వార్థంగా సేవ చెసే నాయకులు వస్తారు.. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చారు.. ఆంద్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఉద్దానం, విశాఖపట్నం, భీమవరం ప్రజలు కూడా మొన్నటి 2019 ఎలక్షన్స్ లో అలానే వ్యవహరించారు.

విలాసవంతమైన జీవితం త్యాగం చేసి.. తనకు ఈ స్థాయినిచ్చిన సమాజానికి తిరిగి ఏదో మంచి చేద్దామని ఒక్కడొచ్చాడు.. నిరూపించుకున్నాడు.. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పకడ్బందీగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు కళ్యాణ్ గారు.. ఆయన ఏం చెబుతున్నాడో శ్రద్ధగా వినండి.. ఇంకా మీకు ఎందుకు సందేహాలు.. తేడా గమనించే విచక్షణ మీకు లేదా..??!!

– గోపాలకృష్ణ, రాజేంద్రనగర్ నియోజకవర్గం