బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో పలువురి చేరిక

జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మరియు బొమ్మిడి నాయకర్ నాయకత్వానికి ఆకర్షితులై నరసాపురం నియోజకవర్గం, మల్లవరం గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చెలంకూరి మాణిక్యాలరావు, చెన్నూరి కొండలరావు, చంద్రయ్య, ప్రసాదం దుర్గారావు, భారతాల రాజేష్, మోకా శ్రీను, గాది రాజు, గూడూరి గోపీ, ఓగూరి రాజు మరియు తదితరులు జనసేన పార్టీ నరసాపురం నియోజకవర్గ ఇంచార్జి మరియు రాష్ట్ర రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు బొమ్మిడి నాయకర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో వలవల నాని, ఆకన చంద్రశేఖర్, పులపర్తి రాంబాబు, జడ్డు మల్లిఖార్జున, పోసినసెట్టి పవన్, కేత నాగరాజు, పిడకల వెంకటేశ్వర రావు, పులకందం ఆదిశేషు, పులకందం పవన్, నాయుడు దొరబాబు మరియు సోమిసెట్టి నాని తదితరులు పాల్గొన్నారు.