శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకున్న ఉగ్గిన రాము

కోటవురట్ల మండలం, కొడవటిపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారు జూన్ 24 తేదీన బాలేపల్లి గోవిందురావు కుమారుడు బాలేపల్లి శ్రీనివాసరావు చేతులు మీదగా విగ్రహ ప్రతిష్ట జరిగింది. ఆదివారం రామచంద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు ఉగ్గిన రాము ఆధ్వర్యంలో మరియు ఆ గ్రామ జనసేన కార్యకర్తలు శ్రీ శ్రీ శ్రీ తలుపులమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజావాణి కార్యక్రమం సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్లాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా ప్రార్ధించుకున్నారు. అదేవిధంగా కొడవటిపూడి గ్రామానికి చెందిన జనసేన నాయకులు బాలేపల్లి ఏసుబాబు జనసేన పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను సిద్ధాంతాలను గ్రామ స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలని.. అక్కడికొచ్చిన జనసైనికులు అందరికీ తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జనసేన పార్టీ కార్యకర్తలు, వీర మహిళకు మరియు జనసైనికులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.