పండగల సీజన్.. ప్రత్యేక రైళ్లు!

దేశంలో పండగల సీజన్ ప్రారంభం కానుండటంతో ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లు నడిపేందుకు సిద్ధమైందని, భారతీయ రైల్వే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 30 వరకు 200 ప్రత్యేక రైళ్లు నడపున్నట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే యాదవ్ తెలిపారు.

దసరా, దీపావళి పండగలు ఒకదాని తర్వాత మరోటి రానున్న క్రమంలో ప్రయాణాలు భారీగా పెరగనుండటం, ఇప్పటికే ఉన్న ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు పూర్తయిపోవడంతో రైల్వే శాఖ ఎట్టకేలకు స్పందించింది. జోన్ల వారీగా ప్రతిపాదనలు తీసుకుంది. కరోనా కారణంగా మార్చి 22 నుంచి సాధారణ ప్రయాణికుల రైళ్లు నడపడం లేదు. తాజాగా, పండగ సెలవుల దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపాలని రైల్వే శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. క్షేత్రస్థాయిలో కరోనా సమస్య తక్కువగా ఉంటే 200 కంటే ఎక్కువ రైళ్లనే నడుపుతామని వీకే యాదవ్ పేర్కొన్నారు.