ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జనసేన ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు వంగ లక్ష్మణ్ గౌడ్ ఆదేశాల మేరకు గురువారం ఉదయం 9.30 నిమిషాలకు నాగర్ కర్నూల్ జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండా అవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాగర్ కర్నూల్ పిఈసి మెంబెర్ జానీ ఉమ్మడి, మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం వైస్ ప్రెసిడెంట్
గోపాస్ కురుమన్న, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యువజన విభాగం ఆర్గనైజింగ్ సెక్రటరీ బారిగరి రాజేందర్, నర్సింహా మరియు రాజు తదితరులు పాల్గొన్నారు.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-02-at-1.17.36-PM-1.jpeg)
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/06/WhatsApp-Image-2022-06-02-at-1.17.36-PM.jpeg)