కుమ్మరి కుంట చెరువు పై కన్నేసిన ఇసుకాసురులు

గూడూరు మండలంలో మట్టి తవ్వకాలపై అనేక అక్రమాలు వెలుగు చూసినప్పటికీ.. వివిధ పత్రికల్లో అనేక కథనాలు వచ్చినప్పటికీ ఇసుక మాఫియా మాత్రం తమ ఆగడాలను కొనసాగించడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు.

గూడూరు మండలం, గూడూరు గ్రామంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి సంబంధించిన కుమ్మరి కుంట చెరువులో మట్టి తవ్వే అందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

శుక్రవారం రాత్రి స్థానిక వైసిపి నాయకులు అధికారులపై ఒత్తిడి చేయడం జరిగింది. మట్టి తవ్వకాలు సంబంధించి మిషన్ కూడా తీసుకు రావడం జరిగింది. అధికారులు అంగీకరించకపోవడంతో తవ్వకాలు జరగలేదు. వైసిపి నాయకులు ఒత్తిడి తట్టుకోలేక అధికారులు సతమతమవుతున్నారు. కొందరు అధికారులు అయితే సెలవుపై వెళ్లిపోవడానికి ప్రయత్నిస్తున్నారు.

జనసేన పార్టీ నాయకులు కలెక్టర్ కి ఫిర్యాదు చేసినప్పటికీ.. అక్రమ మట్టిని అమ్ముకొని సొమ్ము చేసుకునే కొందరు అధికార పార్టీ నాయకులు కుమ్మరిగుంటలో మట్టి తవ్వకానికి ముందుగానే పథకం రచించి చెరువులు ఎండగట్టడం జరిగింది.

జనసేన పార్టీ మట్టి అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయటంతో ఆగిన మట్టి మాఫియా తిరిగి తమ తవ్వకాలను కొనసాగించే ప్రయత్నం చేస్తున్నాయి.

పెడన నియోజకవర్గంలో మా దృష్టికి వచ్చిన ఏ అక్రమ మట్టి తవ్వకాలు ఇస్తాం. మీరు అర్ధరాత్రి అవ్వాలనుకున్నా మీ ప్రయత్నాన్ని ఆపుతాం అని పెడన నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు ఎస్ వి బాబు హెచ్చరించారు.