పండుగలా గుంటూరు జనసేన సభ్యత్వ కిట్లు పంపిణీ..

గుంటూరు: పార్టీ అధ్యక్షులు శ్రీపవన్ కళ్యాణ్ పిలుపు మేరకు… జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆదేశాల ప్రకారం… గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్లపంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.. కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యులకు ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు కిట్లను ప్రదానం చేశారు.. వాలంటీర్ల కు ప్రసంశపత్రాలతో బాటు సత్కరించటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు బిట్రగుంట మల్లిక, నారదాసు రామచంద్ర ప్రసాద్, కొప్పుల కిరణ్ బాబు, నగర అధ్యక్షులు నెరేళ్ల సురేష్ అతిథులుగా పాల్గొన్నారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.