ప్రజల చూపు జనసేన వైపే: మర్రాపు సురేష్

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం: పల్లె పల్లెకు జనసేన పార్టీ కార్యక్రమంలో భాగంగా మూడోరోజు గురువారం ఉదయం, గజపతి నగరం మండలం, ఎం. వెంకటాపురం లోను, మరియు సాయంత్రం పాత శ్రీరంగ రాజపురంలోను గజపతినగరం జనసేన పార్టీ సీనియర్ నాయకులు మర్రాపు సురేష్ ఇంటిఇంటికి జనసేన సిద్దాంతాలతో కూడియున్న కరపత్రాలను పంచుతూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వెళ్లారు.

ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏ ఇంటికి వెళ్లినా ప్రజల ఆదరణ బాగుందని, ప్రతీఒక్కరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలుస్తామనటం ఎంతో ఆనందదాయకమని,శుభసూచకమని ఖచ్చితంగా ప్రజలచూపు జనసేన వైపు ఉందని అన్నారు.

కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు, మిడతాన రవికుమార్, జనసేన ఝాన్సీ వీరామహిళ సబ్బి లావణ్య, సబ్బి సురేష్ రెడ్డి, పండు, కడమల శ్రీను, హరీష్ నాని, చలం, రవీంద్ర, మజ్జి ఆదినారాయణ, లోపింటి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.