రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి

మదనపల్లె, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, చేసిన అప్పులు, రుణాలు కోసం ఇచ్చిన గ్యారంటీలు నిధుల వ్యయంపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మనం శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక పరిస్థితులకు చేరువలో ఉన్నామా…? లేదా…? అనేది ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో ఏమాత్రం విలువలు పాటిస్తున్న ఏమాత్రం నిజాయితీ ప్రజాస్వామ్యంపై విశ్వాసం వెంటనే శ్వేత పత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల నుండి వసూలు చేసిన ప్రజల పేరిట తెచ్చిన అప్పుల్ని వారికి తెలియజేయకుండా దాచి ఉంచడం నేరం 5 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అందులో ఒకటిన్నర లక్షల కోట్లు నగదు వేశామని ప్రభుత్వం చెబుతోంది మరి మిగతా మూడున్నర లక్షల కోట్లు ఏమయ్యాయి రాష్ట్ర ఖర్చులు అప్పుల గురించి అడిగిన సరే ఎందుకు సమాధానం చెప్పడం లేదు ఏపీ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణపై విశ్వాసం లేదని కాదు చెప్పింది ప్రభుత్వం చేసినట్లుగా చెబుతున్న ఖర్చులు ధృవీకరించడమని కూడా కాగ్ ప్రకటించింది ద్రవ్యలోటును నాలుగు నుండి రెండు శాతానికి తగ్గించామని చెబుతున్న ఆర్థిక మంత్రి అది ఎలా తగ్గించారు అనే విషయం వివరంగా ప్రజలకు చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని చిత్తూరు జిల్లా కార్యదర్శి దారం అనిత అన్నారు.