రైతులకు అండగా ఉంటాం

  • క్రాప్ ఇన్సూరెన్స్ బీమా అవినీతిపై న్యాయం కోసం! కదంతొక్కిన జన సైన్యం.
  • బండారు శ్రీనివాస్ నాయకత్వానికి జేజేలు పలికిన రైతులు, పలుగ్రామాల ప్రజలు!

అంబేద్కర్ కోనసీమ జిల్లా, కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలోని, ఆలమూరు టౌన్ హాలు నందు సోమవారం భారీ ఎత్తున జనసేన పార్టీ రైతుల కోసం ఇన్ పుట్ సబ్సిడీ భీమా పరిహారంలో అవినీతి అవకతవకలు జరిగాయని, ఆలమూరు మండలంలోని పలు గ్రామాలు అయిన సూర్యారావుపేట, చింతలూరు, ఆలమూరు తదితర గ్రామాల్లో కొందరు రైతులు కానీ దళారులు చేతిలోకి ఈ భీమా సొమ్ములు వెళ్లాయని, సరైన రైతులకు న్యాయం కోసం పలు సమస్యలపైన గళమెత్తిన జనసేన పార్టీ కొత్తపేట నియోజకవర్గం జనసేన ఇన్చార్జి బండారు శ్రీనివాస్ నాయకత్వంలో ఆలమూరు టౌన్ హాల్ నందు సమావేశమై పాదయాత్రగా భారీ ఎత్తున రైతులు, జనసైనికులు, కార్యకర్తలు, స్థానిక ఎమ్మార్వో వారి కార్యాలయమునకు చేరి ఎమ్మార్వో వారికి వినతిపత్రం అందించడం జరిగింది. అలాగే మండల పరిషత్ అభివృద్ధి అధికారిణి వారికి కూడా వినతిపత్రం అందిస్తూ, పలు సమస్యలను తెలియజేశారు. అంతేకాకుండా ఆలమూరు అగ్రికల్చర్ ఏడిఈ వారి కార్యాలయంలోకి వెళ్లి, రైతులు పడుతున్న ఇబ్బందులను, బీమా పథకంపై పలు అవకతవకలు జరిగాయని, సక్రమంగా రైతులకు అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని, వెంటనే రైతులు పండించిన ధాన్యం బకాయిలను కూడా విడుదల చేయాలని, తొలకరి పంటలకు పెట్టుబడులకు, రైతులు అమ్మిన దాన్యం డబ్బులు వెంటనే విడుదల చేసి వారిని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుమారు అతి భారీ సంఖ్యలో రైతులు, జనసైనికులు, గ్రామ ప్రజలు పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు, రైతులు బండారు శ్రీనివాస్ నాయకత్వానికి ఎంతో మద్దతు ఇస్తూ, జనసేనాని పవన్ కళ్యాణ్ ఆశయాలతో, ప్రతి ఒక్క రైతు కష్టసుఖాల్లో ముందుంటామని, జనసేనాని ఏప్పుడు రైతులకు అండగా ఉంటారని, రైతు కుటుంబం, ఏప్పుడు కంటతడి పెట్టకుండా జనసేనాని రైతులను కంటికి రెప్పలా కాపాడుతారని, ప్రతి ఒక్క రైతుకు జనసేన పార్టీ తరుపున మేమంతా అండగా ఉంటామని, ప్రముఖ జనసేన నేత బండారు శ్రీనివాస్ రైతుల పట్ల తన ఆవేదనతో కూడిన ప్రసంగంలో తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్ల డేవిడ్ రాజ్, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు దొంగ సుబ్బారావు, బొక్క ఆదినారాయణ, సంగీత సుభాష్ పినపల్ల జనసేన యువ సర్పంచ్, ఆలమూరు మండల జనసేన పార్టీ అధ్యక్షులు సురపు రెడ్డి సత్య, ఆత్రేయపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు చేకూరి కృష్ణంరాజు, రావులపాలెం జనసేన పార్టీ మండల అధ్యక్షులు తోట స్వామి, పినపల్ల ఎంపీటీసీ పెద్దిరెడ్డి పట్టాభి, మడికి ఎంపిటిసి ఉండ్రాసపు వెంకన్న, చొప్పెల్ల ఎంపీటీసీ జాంపోలు నాగేశ్వరరావు, మూలస్థానం ఎంపీటీసీ బావిశెట్టి తాతాజీ, మూలస్థానం సర్పంచ్ లంక వరప్రసాద్, సందిపూడి సర్పంచ్ తోట భవాని వెంకటేశ్వర్లు, సందిపూడి ఎంపీటీసీ తోలేటి సంతోషి, చెముడులంక ఎంపీటీసీ తమ్మన భాస్కరరావు, బడుగువాణి లంక ఎంపీటీసీ పడాల అమ్మిరాజు దంపతులు, ఆలమూరు మండల జనసేన సీనియర్ నాయకులు కొత్తపళ్లి నగేష్, గారపాటి త్రిమూర్తులు, సలాది జయప్రకాష్ నారాయణ (జేపి) సూర్యారావుపేట యువ నాయకులు శెట్టిబలిజ నేత వనుం సూరిబాబు, ఆలమూరు గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు కట్టా రాజు, చెల్లి రాజశేఖర్, చల్లా వెంకటేశ్వరరావు, కొనకళ్ళ ధనరాజు, సీనియర్ నాయకులు తులా రాజు, మహాదశ బాబులు, చింతపల్లి సత్తిపండు, మీడియా ప్రతినిధి బైరీశెట్టి రాంబాబు, నాగిరెడ్డి మహేష్, కోట వరలక్ష్మి, కొండేటి హేమదేవి, కొండేపూడి వరప్రసాద్, శిరిగినీడి పట్టాభి, పెట్టా రంగనాథ్, గుడాల నాగబాబు, దాసి మోహన్, పసుపులేటి సాయిబాబా, లంకే సతీష్ పలువురు జనసైనికులు, కార్యకర్తలు, వీర మహిళలు, నాయకులు అధిక సంఖ్యలో భారీ ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని, పాదయాత్రను విజయవంతం చేశారు.