మరొ రెండు రోజులపాటూ భారీ వర్షాలు

బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండంగా మంగళవారం ఉదయం 6.30-7.30 గంటల మధ్య కాకినాడ వద్ద తీరం దాటింది. ఆ తరువాత పశ్చిమ వాయువ్యంగా పయనించి మధ్యాహ్నానికి వాయుగుండంగా బలహీనపడి తెలంగాణలో కేంద్రీకృతమైంది. ఈ నెపధ్యం లొ రాష్ట్రవ్యాప్తంగా రెండు మూడు రోజులపాటూ విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. తీవ్ర వాయుగుండం కాకినాడ, తుని వద్ద తీరాన్ని తాకింది. ప్రధానంగా మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్‌, జయశంకర్‌ భూపాలపల్లి, సిద్దిపేట, ములుగు, రాజన్నసిరిసిల్ల, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌రూరల్‌, వరంగల్‌ అర్బన్‌, మహబూబాబాద్‌, కొత్తగూడెం, సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌కర్నూల్‌, జనగామ జిల్లాల్లోని చాలాప్రాంతాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురువొచ్చని వెల్లడించింది. ప్రధానంగా 17 జిల్లాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్న అంచనాల నేపథ్యంలో వాతవారణశాఖ అధికారులు ఆయా జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ను జారీచేశారు.

రాష్ట్రంలో ఈ వర్షాకాలంలో సాధారణం కంటే సుమారు 45 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాతావరణశాఖ లెక్కల ప్రకారం సెప్టెంబర్ 30 నాటికే వానాకాలం ముగిసినా.. వరుస అల్పపీడనాల ప్రభావంతో తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఇంకా చురుకుగానే ఉన్నాయని తెలిపింది. రుతుపవనాల నిష్క్రమణ ప్రారంభం కాలేదని, వచ్చేవారం వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని పేర్కొంది.