జనసేనకు జనసైనికులే కొండంత అండ

  • ప్రజా సేవకులను నాయకులుగా తీర్చిదిద్దుతున్న జనసేన
  • వైసీపీ దుష్పరిపాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత
  • రానున్న ఎన్నికల్లో అధికార మార్పు తధ్యం
  • జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు నాగబాబు

గుంటూరు, జనసేన పార్టీ సిద్ధాంతాలను, పవన్ కళ్యాణ్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లటంలోనూ, ప్రజా సమస్యల పరిష్కారానికై జరిగే ఉద్యమాల్లోనూ జనసైనికుల కృషి వెలకట్టలేనిదని, జనసేన పార్టీకి జనసైనికులే కొండంత అండ అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు అన్నారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి ఆధ్వర్యంలో పలువురు పార్టీ నాయకులు నాగబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాతో పాటూ నగరంలో జరుగుతున్న పార్టీ కార్యక్రమాలను, అంతర్గత విషయాలనూ ఆళ్ళహరి నాగబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆళ్ళహరి మాట్లాడుతూ పార్టీ పట్ల ప్రజల్లో రోజురోజుకీ ఆదరణ పెరుగుతుందని, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం పట్ల, అవలంభిస్తున్న రాజకీయ విధానాల పట్ల పార్టీకి క్షేత్రస్థాయిలో మద్దతు లభిస్తుందని ఆళ్ళహరి అన్నారు. ప్రజలకు ఏ సమస్య ఎదురైనా జనసేన వైపు చూస్తున్నారని, ఎలాంటి సమస్య అయినా జనసేనతోనే పరిష్కారం లభిస్తుందన్న భావనతో ప్రజలున్నారని ఆళ్ళహరి నాగబాబు దృష్టికి తీసుకువెళ్లారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ… ప్రజా సేవకులను, సమాజం పట్ల బాధ్యత కలవారు నాయకులుగా ఎదిగేందుకు జనసేన ఒక మంచి ఫ్లాట్ ఫామ్ అన్నారు. అధికార మదంతో వైసీపీ అవలంభిస్తున్న దుష్పరిపాలనపై క్షేత్రస్థాయిలో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొందని, అదే సమయంలో ప్రజలు జనసేన వైపు చూస్తున్నారన్నారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత నుంచి దృష్టిని మరల్చేందుకు కులమతాల గొడవలు సృష్టిస్తున్నారన్నారు. వైసీపీ పాల్పడే రాక్షస రాజకీయ క్రీడల పట్ల ప్రజల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాల్సిన అవసరం ప్రతీ జనసైనికుడిపై ఉందన్నారు. ప్రజల్లో చైతన్యం మొదలైందని రానున్న ఎన్నికల్లో అధికార మార్పిడి తధ్యమని నాగబాబు అన్నారు. నాగబాబుని కలిసిన వారిలో తాడివాక వెంకట రమణ, చెన్నా పోతురాజు, కంకణాల శంకర్, కోనేటి ప్రసాద్, వడ్డె సుబ్బారావు ఉన్నారు.