చీపురుపల్లిలో ఐదవరోజు క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

చీపురుపల్లి, జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం కిట్లను చీపురుపల్లి నియోజకవర్గం, మెరకముడిదాం, మండలం ఇప్పలవలస గ్రామంలో జనసైనికులకు పంపిణీ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా గ్రామ జనసైనికులతో

  1. వాళ్ళ గ్రామంలో సమస్యల గురుంచి.
  2. పార్టీని బలోపేతం ఎలా చేయాలి.
  3. పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఆశయాలు, ప్రజలకి చెప్పడం గురించి చర్చించడం జరిగింది. దీనితో పాటు చనిపోయిన కౌలు రైతులకు 30 కోట్లు సహాయం చేసిన టీమ్ పిడికిలి పోస్టర్లు కూడా ఇవ్వడం జరిగింది. కిట్ల పంపిణీకి సహకరించిన గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొనడం జరిగింది.