ఎమ్మెల్యే పర్యటనకు వస్తే జనసేన ఫ్లెక్సీలు ఎందుకు తీస్తున్నారు?
విజయనగరం పట్టణం సుందరీకరణ చేస్తామన్నప్పుడు పట్టణంలో ఫ్లెక్సీలను నిషేదించాలి, లేదా ఛలాన కట్టించుకొని అనుమతి ఇవ్వండి. ఎమ్మెల్యే పర్యటనకు వస్తే జనసేన ఫ్లెక్సీలు ఎందుకు తీస్తున్నారు?. ఎమ్మెల్యేవి, వారి కూతురివి, అల్లుడువి, మనమరాలువి నెలల తరబడి ఫ్లెక్సీలు ఎందుకు తీయట్లేదు? మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఫ్లెక్సీల కోసం టౌన్ ప్లానింగ్ అధికారి సమావేశంలో జనసేన పార్టీ తరపున పాల్గొన్న నాయకులు త్యాడ రామకృష్ణారావు(బాలు) లోపింటి కళ్యాణ్ డిమాండ్ చేయడం జరిగింది.
![](http://sritvtelugu.com/wp-content/uploads/2022/07/WhatsApp-Image-2022-07-06-at-10.08.00-PM-1024x382.jpeg)