చిట్టినగర్ సొరంగం దగ్గర కొండ చర్యలు విరిగిపడటంతో స్తంభించిన ట్రాఫిక్

చిట్టినగర్, విజయవాడ: ఎడతెరిపి లెకుందా కురుస్తున్న వర్షాలకి కొండ నాని ఉండటంతో చిట్టినగర్ సొరంగం దగ్గర కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, ఈ పరిసర ప్రాంతంలో వాహనదారులు భయబ్రాంతులకు గురవుతూ ప్రయాణిస్తున్నారు.. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఇంతకంటే పెద్ద బండరాళ్లు విరిగి పడడం జరిగింది.. కొన్ని సందర్భాల్లో ఆస్తి నష్టం కూడా జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వం గానీ.. అధికారులు కానీ ఇప్పుటి వరకూన్ ఎటువంటి భద్రత చర్యలు చేపట్టకపోవడం వారి నిర్లక్ష్యానికి ఏదైనా ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉంది. ప్రాణ నష్టం జరిగేదాకా చూస్తారా? పొరపాటున ప్రాణ నష్టం జరిగితే దానికి ఈ ప్రభుత్వం మరియు అధికారులు బాధ్యత వహించాలని జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ ధార్మిక మండలి సభ్యులు కూర్మారావ్ నారంశెట్టి హెచ్చరించారు.