నిరాడంబరంగా మైసూరు దసరా ఉత్సవాలు

అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యే మైసూరు దసరా ఉత్సవాలు  కరోనా వైరస్‌ కారణంగా వేడుకలు నిరాడంబరంగానే మొదలయ్యాయి.. ముఖ్యమంత్రి యడియూరప్ప మైసూరు రాజకుటుంబీకులతో కలిసి చాముండేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈసారి ఆ వేడుకలను ప్రత్యక్షంగా చూసే అదృష్టం ప్రజలకు లేదు.. ఉత్సవాలను లైవ్‌ టెలికాస్టులో చూడవచ్చు.. నవరాత్రులలో రాజప్రసాదం, చాముండేశ్వరి ఆలయం కొత్త కాంతులను అద్దుకుంటాయి.. విద్యుత్‌దీపాల వెలుగులో మెరిసిపోతుంటాయి.. మైసూరులో దసరా ఉత్సవాలను నిర్వహించడమన్నది 15వ శతాబ్దంలోనే మొదలయ్యింది.. విజయనగర పాలకులు కూడా దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.. విజయనగర సామ్రాజ్యం పతనం అయ్యాక మైసూరు రాజులైన ఒడయార్లు ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు.