కడెం ప్రాజెక్ట్ క్షేమం కోరుతూ పూజలు నిర్వహించిన సుంకెట మహేష్ బాబు

నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్ కూలిపోకుండా వరణుడు కరుణించాలని కోరుతూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో భైంసాలో ఆంజనేయస్వామి గుడిలో జనసేన పార్టీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు సుంకెట మహేష్ బాబు పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత మూడు రోజులుగా ఎడతెరపి లేని వర్షం పడుతుంది.. దానికి నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు ప్రమాదపు అంచున చేరుకుంది. గత పది సంవత్సరాలుగా ఎప్పుడు లేని విధంగా భారీ వర్షం పడటంతో వరద నీరు ప్రాజెక్ట్ లోకి చేరిన లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతానికి గేట్ల ద్వారా ఎత్తివేశారు. దీని వల్ల దిగువన వున్న దాదాపు 25 గ్రామాలు పూర్తి స్థాయిలో మునిగిపోయే ప్రమాదం వుంది. ఆ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం ఆ కుటుంబాలు ఇప్పటికే వ్యవసాయం మీద నమ్ముకొని, గోర్లు, బర్లు,కోళ్లు ఇంటి సామగ్రినీ వదిలేసి కట్టు బట్టలతో ఊర్లు కాళీ చేసి వెళ్ళే పరిస్థితి దాపురించింది. అధికారులు జిల్లా కలెక్టర్, మంత్రి, ఇంజనీర్లు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రాజెక్ట్ పరిస్థితి విషమంగా మారింది. దాన్ని ఆ భగవంతుడే కాపాడాలని కోరుతూ వరనుడు కరునించాలని, వరద ఉదృతి తగ్గాలని పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు నిఖిల్, దేవ్, మహేష్, పవన్, గంగాధర్, అభి, రోహిత్, తదితరులు పాల్గొన్నారు.