గాఢ నిద్రలో ఉన్న సీఎం ను మేలుకొల్పుదాం!.. రహదార్లు ఎంత గొప్పగా వున్నాయో చూపిద్దాం

బుక్కరాయసముద్రం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు టి సి వరుణ్ పిలుపు మేరకు.. రోడ్ల అద్వాన పరిస్థితులను తెలియజేస్తూ సింగనమల నియోజక వర్గం జనసేన పార్టీ అధ్వర్యంలో #GoodMorningCMSir  డిజిటల్ క్యాంపెయిన్ లో భాగంగా శుక్రవారం బుక్కరాయసముద్రం మండల కేంద్రము నందు ముసలమ్మ కట్ట నుండి కలెక్టరు ఆఫీస్ వెళ్ళే దారిలో రోడ్డు అధ్వాన పరిస్థితిని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి సాకే మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి చొప్ప చంద్ర, జిల్లా సయుక్త కార్యదర్శి డి. జయమ్మ, బుక్కరాయసముద్రం మండల అధ్యక్షలు జి. ఏర్రిస్వామి, మండల నాయకులు రాగే శివ, మునీంద్రా, పెద్దిరాజు, కుళ్ళయప్ప, తాహిర్, శ్రీనాథ్, త్రిలోక, తదితరులు పాల్గొన్నారు.