గుంతకల్ జనసేన ఆధ్వర్యంలో గుడ్ మార్నింగ్ సిఎం సార్

గుంతకల్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రోడ్ల దుస్థితిపై #GoodMorningCMSir హ్యాష్ టాగ్ తో గాఢనిద్రలో ఉన్న సీఎంని మేల్కొల్పేఎందుకు గుంతకల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం కొనకొండ్ల గేట్ నుండి అంకాలమ్మ గుడి రహదారి దుస్థితిని తెలియజేస్తూ డిజిటల్ క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనంతపురం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి వాసగిరి మణికంఠ, జిల్లా సంయుక్త కార్యదర్శి అరికేరి జీవన్ కుమార్, మండల అధ్యక్షుడు కురువ పురుషోత్తం, జిల్లా కార్య నిర్వహణ కమిటీ సభ్యులు పవర్ శేఖర్, అమీర్ సోహెల్ నిస్వార్థ జనసైనికులు జనసేన నాయకులు బోయ సురేష్, విజయ్ కుమార్, బోయ వీరేశ్, ఆర్.సి సురేష్, రామకృష్ణ, మహేష్, పసుపులేటి ఓబులేసు, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.