చుండూరు జనసేన ఆధ్వర్యంలో డిజిటల్ క్యాంపెయిన్

చుండూరు మండలం: జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపుతో గుడ్ మార్నింగ్ సీఎం సార్ కార్యక్రమంలో భాగంగా చుండూరు మండలం, పెద్దగాదెలవర్రు గ్రామంలో గుంతలు నిండిన రహదారి పట్ల నిరసన తెలియజేసి.. చుండూరు మండలం తహసీల్దార్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో చుండూరు మండలం జనసేన అధ్యక్షులు శ్రీరామమూర్తి, జిల్లా కార్యదర్శి బోడియ్య, ఉపాధ్యక్షులు దేవిరెడ్డి మహేష్, బోడపాటి బోస్, జగదీష్, నాగరాజు, జనసైనికులు పాల్గొన్నారు.