పోలీసు అమరవీరులకు సిఎం కెసిఆర్ నివాళి

పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు సిఎం కెసిఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను, త్యాగాలను ముఖ్యమంత్రి గుర్తుచేసుకున్నారు. పౌరుల ప్రాణాలు, ఆస్తుల పరిరక్షణకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పోలీసులు చేసిన త్యాగాలను ప్రజలు ఎప్పటికీ మరచిపోలేరని చెప్పారు. అమరవీరులు చూపిన ఆదర్శాలను పోలీసు బలగాలు అనుసరించాలని కోరారు. అమరుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ సర్కార్ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు నివాళులు అర్పిస్తున్నారు.