జయంత్ ప్రశంసలందుకున్న లైఫ్ డెమో ఫిలిం

  • ఇండియన్ తెలుగు ఆహా ఐడల్ టాప్ ఫైవ్ ఫైనలిస్ట్ జయంత్

ఇటీవల” లైఫ్ డెమో ఫిల్మ్” తో యువ హీరోగా అరంగ్రేటం చేసినటువంటి అర్జున్ నటించిన డెమో ఫిల్మ్ ప్రతి ఒక్కరి నుండి ప్రశంసలందుకున్నది. ముఖ్యంగా సినిమాటిక్ కోణంలో, తక్కువ బడ్జెట్లో, తక్కువ నిడివితో, కొన్ని లొకేషన్స్ తో అద్భుతంగా చిత్రీకరించారు. చిత్ర పరిశ్రమ లో ఉన్న తన సహచర నటులు, మిత్రులు రాబోయే రోజుల్లో అర్జున్ ఇంతకంటే పెద్ద బడ్జెట్లతో, పెద్ద హీరోగా సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల ముగిసిన ఇండియన్ తెలుగు ఆహా ఐడల్ సింగర్ జయంత్ మాట్లాడుతూ అర్జున్ హీరోగా నటించిన లైఫ్ డెమో ఫిల్మ్ చాలా బాగుంది. ఈ సినిమాలో హీరో ఇంట్రడక్షన్ కానీ, సినిమా క్లైమాక్స్ కంటెంట్ అదేవిధంగా అన్ని రకాల ఎలివేషన్స్ మరియు హీరో, విలన్, ఇతర నటీనటుల ఏలివేషన్స్, ఫైట్ సీక్వేషన్స్, మేకింగ్ విజువల్స్ ప్రతి ఒక్కటి అధ్బుతం గా ఉన్నాయి. ఇలాంటి యువ హీరోలని, కొత్త నటీనటులను ప్రతి ఒక్కరూ ఆశీర్వదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. చిత్ర పరిశ్రమ ఎప్పుడూ కొత్తదనాన్ని కోరుకుంటుంది. కొత్త నటీనటులను ఆశీర్వ దించినప్పుడే, కొత్త కథలు వెలుగులోకి వస్తాయి. ప్రతి ఒక్కరు కళామతల్లి ఆశీస్సులతో ముందుకు ఎదగడంతో పాటు, ఎంతోమందికి ఆదర్శంగా నిలుస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అర్జున్ హీరోగా నటించే తదుపరి సినిమాలలో నేను కచ్చితంగా పాట పాడుతానని పేర్కొంటున్నాను. హీరో అర్జున్ మాట్లాడుతూ నన్ను అభిమానించే ప్రతి ఒక్కరికీ, డెమో ఫిల్మ్ తో హీరో గా వచ్చినప్పటికీ తమ కుటుంబ సభ్యులు గా నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు. జయంత్ అన్న గారికి, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి డైరెక్టర్ కల్లా అర్జున్ కి, నిర్మాత రాజగోపాల్ పొడాల, సుజాత గారికి, ఇతర నటీనటులకి ధన్యవాదాలు. ముఖ్యంగా మాలాంటి యువ నటీనటులకు, డైరెక్టర్లకు నిర్మాతల ప్రోత్సాహము తో పాటు, తెలుగు ప్రేక్షకుల ప్రేమ, అభిమానాలు ముఖ్యం అని పేర్కొంటూ, కథలో కొత్తదనం ఉంటే మన తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని మరొక్కసారి నిరూపించారు అని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మంచి కథలతో మీ ముందుకు వస్తున్నాను. ప్రస్తుతం నేను మూడు కథలు విన్నాను. అందులో రెండు కథలు సూపర్ గా ఉన్నాయి. తేజ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన సాయి శ్రీనివాస్ కథ బాగా నచ్చింది. ఇది ఓటిటి కు సంబంధించినటువంటి మూవీ మరియు ఇంకొకటి సూర్య చెప్పిన డివోషనల్ స్క్రిప్ట్ వెబ్ సిరీస్ కు సంబంధించినది. ప్రొడ్యూసర్స్, నటీనటుల ఎంపిక కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే మా మూవీకి సంబంధించిన వివరాలు మీడియా మిత్రులకు అందజేస్తాం. తొలిసారి హీరోగా అరంగ్రేటం చేసినటువంటి నన్ను ప్రోత్సహించిన తోటి నటీనటులకు, నా మిత్రులకు, సోషల్ మీడియా మిత్రులకు, ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసారు.