సిపిఐ నారాయణ పై తాడిపత్రి పోలీస్ స్టేషన్ లో పిర్యాదు

సిపిఐ జాతీయ అధ్యక్షుడు నారాయణ, డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి పై అనుచిత వ్యాఖ్యలు ఖండిస్తూ.. తాడిపత్రి చిరంజీవి రాష్ట్ర యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు. అన్నయ్య చిరంజీవి గారు భారత సినిమా రంగం ఏ హీరో చేయనటువంటి సేవాకార్యక్రమాలు.. సమాజానికి తనవంతు సహాయం చేస్తూ మధర్ థేరీసా అర్శంతో.. మచ్చలేని మహా రాజు లా ముందుకు వెళ్తున్నారు. అటువంటి వ్యక్తిని అనుచిత వ్యాఖ్యలు చేసి అభిమానుల ఆగ్రహానికి గురైన వయసుమల్లిన రాజకీయ పండితులుగా పేరు గడించిన నారాయణ ని అరెస్టు చేయాలని తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ధరణి బాబు కి పిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి రాష్ట్ర యువత ఉపాఅధ్యక్షుడు కుమ్మెత ప్రతాప్ రెడ్డి, కుందుర్తి నరసింహా చారి, షేక్ సాధక్ వలి, అచుకట్ల అల్తాఫ్, మధినేని గోపాల్, కరీం మొదలైన వారు పాల్గొన్నారు.