భారతరత్న అబ్దుల్ కలాంకి సత్తెనపల్లి జనసేన ఘననివాళి

సత్తెనపల్లి, భారత మాజీ రాష్ట్రపతి, భారతరత్న స్వర్గీయ అబ్దుల్ కలాం 7 వ వర్ధంతిని సత్తెనపల్లి నియోజకవర్గ జనసేనపార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ముందుగా నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో కలాం చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం స్థానిక స్టేషన్ రోడ్డులో గల కలాం విగ్రహంవద్ద నివాళులు అర్పించి ఆ తరువాత పట్టణంలోని మొల్లమాంబ అనాధ వృద్ధాశ్రమంలో అన్నదానం చేయడం జరిగింది. పార్టీ కార్యాలయ ఇంఛార్జి శిరిగిరి మణికంఠ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన గుంటూరు జిల్లా జనసేనపార్టీ అధికార ప్రతినిధి తవిటి భావన్నారాయణ మాట్లాడుతూ… అతి సామాన్య కుటుంబంలో జన్మించిన కలాం అకుంఠిత దీక్షతో, అత్యంత క్రమశిక్షణతో ప్రపంచంలోనే ప్రఖ్యాతిని పొందిన అంతరిక్ష శాస్త్రవేత్తగా ఎదగడం ప్రతిఒక్కరికీ ఆదర్శనీయమని అన్నారు. మిసైల్ మాన్ గా పిలువబడిన కలాం వారి అపారమైన జ్ఞానసంపదతో భారతదేశ రక్షణకోసం చేసిన కృషికి ఫలితంగా భారతప్రభుత్వం దేశపు అత్యుత్తమ పురస్కారం భారతరత్నతో గౌరవించడం దేశానికే గర్వకారణం అని ఆయన అన్నారు. వృద్దాప్యంలో కూడా దేశవ్యాప్తంగా పర్యటిస్తూ విద్యార్థులను, యువకులను తమ స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసాలతో చైతన్యపరిచిన నిత్యకృషీవలుడు కలాం అని భావన్నారాయణ అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు తోట నరసయ్య, నాదెండ్ల నాగేశ్వరరావు, శిరిగిరి పవన్, కౌన్సిలర్ రంగిసెట్టి సుమన్, వీరమహిళలు నామాల పుష్పలత, మాలెంపాటి సౌజన్య, సూలం రాజ్యలక్ష్మి, జనసైనికులు తాడువాయి శ్రీను, అడపాల ధర్మరాజు, తిరుమలశెట్టి సాంబ, రాయుడు బాలకృష్ణ, కేదారి రమేష్, రుసుం వెంకటేశ్వర్లు, తోట లక్ష్మీనారాయణ, తీర్థాల నాగేశ్వరరావు, నంబూరి శ్రీకాంత్, ఆకుల శ్రీనివాసరావు, తిరుమల సాంబశివరావు, సిసింద్రీ, రామిసెట్టి సన్నీ, గర్నెపూడి చిన్ని, ఎస్.కె ఖాజా, నాగరాజు, చింతల వెంకట్, శివశంకర్, చింతల వెంకట సైదారావు తదితరులు పాల్గొన్నారు.