జనంలోకి జనసేన కార్యక్రమం

వైజాగ్: వైజాగ్ ఉత్తర నియోజకవర్గంలో జనంలోకి జనసేన కార్యక్రమం శనివారం తుమ్మల త్రినాధ్, చింతల వెంకట రమణల ఆధ్యర్యంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా ఉత్తర నియోజక వర్గ ఇంచార్జి పసుపులేటి ఉషా కిరణ్ 45వ వార్డ్ లక్ష్మీ నారాయణ పురం, లెప్రసీ కాలనీలో ఇంటింటికి వెళ్లి జనసేన పార్టీ ఆశయాలను సిద్ధాంతాలను తెలియచేసి, స్థానికంగా వున్న సమస్యలు తెలుసుకుని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కార దిశగా ప్రయత్నం చేస్తానన్నారు. అవినీతి లేని సుపరిపాలన జనసేన పార్టీతోనే సాధ్యం, పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించి ఒక అవకాశం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాహంతి శంకర్, మజ్జి రమణ, బండి రాజు, శివ, గవరకనక రాజూ, తుమ్మల గణేష్, ఊతకోట దామోదర్, కార్పొరేట్ అభ్యర్థులు నీరుకొండ దివాకర్, ముమ్మిన నాగ మణి, అడబాల లక్ష్మి, నాయకులు అలతి మురళి కృష్ణ, గోపి కళ్యాణం, శివ శంకర్ రెడ్డి పెద్ద సంఖ్యలో జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.