రాజోలు జనసేన పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేద్దాం: బల్ల రాము

రాజోలు, బల్ల రాము ఆద్వర్యంలో రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతం కోసం పలు గ్రామాలకు వెళ్లి అక్కడి ప్రజలను, జనసైనికులను కలిసి గెలుపే లక్ష్యంగా పనచేద్దాం అని నియోజవర్గంలో జనసేన పార్టీ మద్దతదారులు అందరికీ అండగా ఉంటాము అని చెప్పడం జరిగింది. ఎక్కడ మనం బలహీనంగా ఉన్నామో గుర్తించి అక్కడి ప్రజలను ప్రభావితం చేయడానికి రాజోలు జనసేన టెక్ టీమ్ సభ్యులు అందరూ ఎవరి గ్రామాల్లో వారు పనిచేయాలి అని అన్నారు. ప్రతి ఒక్క ఓటు పార్టీకి బలం మరియు చాలా ముఖ్యం అని చెప్పారు. చెన్నాడం గ్రామంలో ఎస్సీ సామాజికవర్గం నుంచి బడుగు శ్రీను, వీరమహిళ బడుగు వనజ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పడం జరిగింది. పాలగుమ్మి అనే గ్రామంలో ఇప్పటి వరకు ఎవరు రాలేదు అండి మీరు వచ్చారు చాలా సంతోషం, దైర్యం కలిగించిందని అక్కడి జనసైనికులు చెప్పడం జరిగింది. 50 ఓట్లు ఉంటే ఎవరు మా ఊరు రారా అండి అని వారు ప్రశ్నించారు. ప్రతి ఒక్కరూ పార్టీలో ముఖ్యమని బల్ల రాము అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా ఎస్సీ సామాజికవర్గం ఉన్న ఏకైక గ్రామం మన రాజోలు నియోజకవర్గం రాజోలు మండలంలో ఉంది అని ఎంత మందికి తెలుసు… ? అవును ఇది నిజం రాజోలు మండలంలో చెన్నాడం గ్రామం, గణాంకాలు చెబుతున్నాయి, జనసేన పార్టీ నాయకులు బల్ల రాము ఆ గ్రామం లో జనసైనికులు, వీర మహిళ శ్రీమతి బడుగు వనజ శ్రీను ల ఆహ్వానం మేరకు చెన్నాడం గ్రామం సందర్శించడం జరిగింది. నాలుగు ఓట్లతో మొదలైన ఓట్లు 104 ఓట్లు గత ఎన్నికల్లో జనసేన పార్టీకి వచ్చాయి. ఇలాంటి గ్రామాలను కూడా గుర్తించి అక్కడి జనసైనికులకు, వీర మహిళలకు తగిన గుర్తింపు ఇస్తే పార్టీ బలోపేతం కోసం కృషి చేయడానికి, చిన్న చిన్న గ్రామాల్లో కూడా రాజకీయంగా చైతన్యం తీసుకు రావడం కోసం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అక్కడి వీర మహిళ శ్రీమతి బడుగు వనజ శ్రీను మరియు తదితరులు అన్నారు. ఈ సందర్బంగా రాజోలు నియోజకవర్గం జనసేన నాయకులు బల్ల రాము మాట్లాడుతూ… ప్రతి ఒక్క వీరమహిళలో రాజకీయ చైతన్యం రావాలి అని అదే మన అధినేత పవన్ కళ్యాణ్ ఆశయం దానికోసం రాజోలు టెక్ టీమ్ సభ్యుల నుంచి ప్రతి ఒక్కరికీ అండగా ఉండటము కచ్చితంగా జరుగుతుంది అని ఆయన భరోసా ఇచ్చారు.