చేబ్రోలు యువతకు క్రికెట్ కిట్లు అందజేసిన పిల్లా శ్రీధర్

పిఠాపురం నియోజవర్గం చేబ్రోలు గ్రామంలో జనసైనికులు మరియు యువకుల కోరిక మేరకు డాక్టర్ పిల్లా శ్రీధర్ ఆదివారం సాయంత్రం వారిని కలిసి, వారు కోరిన విధంగా వారికి క్రికెట్ కిట్లు అందజేయడం జరిగింది. అనంతరం డాక్టర్ శ్రీధర్ వాళ్లతో మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతం కోసం, నియోజకవర్గ ఓటర్లలో ఉత్సాహం నింపే ఏ కార్యక్రమాలు చేయడానికి అయినా వెనకాడను అని భరోసాతో కూడిన ఉత్సాహాన్ని నింపారు. చేబ్రోలు జనసైనికులు శ్రీధర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేబ్రోలుకు చెందిన జనసేన పార్టీ నాయకులు, పెద్దలు మరియు పిల్లా శివశంకర్, పిల్లా ముత్యాలరావు మరియు జనసైనికులు పాల్గొన్నారు.