ఆలూరు నియోజవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసిన నాయకులు: ఎరుకుల పార్వతి

కర్నూలు జిల్లా, గాలి మాటలు చెప్పి గాలికి వదిలేసిన నాయకులు. ఆలూరు నియోజవర్గంలో చుట్టుపక్కల గ్రామాల్లో
నుండి ప్రభుత్వ ఆసుపత్రికి రావాలన్నా రోడ్డు సౌకర్యం లేకపోవడంతో నిండు గర్భిణీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గడప గడప కార్యక్రమంలో అభివృద్ధి చేశామని చెబుతున్నారు. తప్ప ఎక్కడా అభివృద్ధి కనిపించడంలేదని ఆలూరు మండలంలో చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి వార్డులో సమస్యలు ఉన్నాయని మరి నాయకులకు కనిపించడం లేదా అని ఘాటుగా జనసేన ఎంపిటిసి ఎరుకుల పార్వతి విమర్శించారు. కొన్నిచోట్ల సిసి రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మురికి నీరు రోడ్లపై నిలచడం వల్ల గ్రామ ప్రజలకు డెంగ్యూ మలేరియా వంటి విశ్వజ్వరాలు వస్తున్నాయని బ్లీచింగ్ పౌడర్ కూడా గ్రామంలో సరిగా చల్లడం లేదని కొన్ని చోట్ల డ్రైనేజీ కాలవలు ఉన్నప్పటికీ ఆ డ్రైనేజీ కాలువలు కూడా నిండిపోయిన పట్టించుకోని అధికారులు. ఇక్కడున్న నాయకులు పదవుల కోసం పాకులాడుతున్నరే తప్ప ప్రజల సమస్యలపై స్పందించడం లేదు అని జనసేన ఎంపీటీసీ ఎరుకుల పార్వతి అన్నారు. ఇప్పటికైనా ప్రజల సమస్యలపై స్పందించాలని కోరుకుంటున్నానని అన్నారు.