రోడ్ల దుస్థితి పై జనసేన, సిపిఐ నాయకుల ఆద్వర్యంలో రాస్తారోకో

  • నిద్రపోతున్న పొన్నలూరు మండలం అధికార పార్టీ నాయకులు
  • ఆగష్టు 15వ తారీకు లోపల గుంతలను అధికారులు పూడ్చాలి

పొన్నలూరులో జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్ మరియు సిపిఐ నాయకులు కే.వీరారెడ్డి ఆద్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది.

ప్రకాశం జిల్లాలో కొండేపి నియోజకవర్గంలో పొన్నలూరు మండలంలో ప్రధాన రహదారిలో గుంతలు చాలా ప్రమాదకరంగా మారాయి, చిన్నపాటి వర్షం పడిన ఈ గుంతల్లో పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి, ఈ రహదారిని అంటిపెట్టుకొని ఒక పక్కన పోలీస్ స్టేషన్, మరో పక్కన పాఠశాలలు, మరో పక్కన ఎం.ఆర్.ఓ ఆఫీసు, ఇంకో పక్కన బ్యాంకులు, ఎన్నో ఇల్లు ఉన్నాయి.. నిత్యం ఈ ప్రధాన రహదారిలో చాలా రద్దీగా వాహనాలు తిరుగుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడినా కానీ చిన్న చిన్న చెరువులను తలపించే విధంగా ఈ రహదారి కనిపిస్తుంది. ఈ రహదారిలో ప్రయాణించాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
పొన్నలూరు మండలంలో అధికార పార్టీకి చెందిన నాయకులు ఈ రహదారిలో నిత్యం ప్రయాణిస్తూ, పట్టీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు ప్రజలందరిని ఆశ్చర్యాన్నికి గురి చేస్తున్నాయి. ఇకనైనా పొన్నలూరు మండలం నాయకులు నిద్రమత్తు వదిలి ఈ గుంతల్ని పూడ్చే విధంగా చేయాలి. ఈ రహదారిలో నిత్యం అధికారులు కూడా ప్రయాణిస్తూ ఉంటారు.
ఆగష్టు 15వ తారీఖు లోపు ఈ గుంతల్ని పూడ్చాలి, ఒకవేళ మీరు ఈ గుంతల్ని పూడ్చనీ పక్షాన 15వ తారీకు తర్వాత భారీ స్థాయిలో రాస్తారోకో నిర్వహించడం జరుగుతుందని హెచ్చరించదం జరిగింది.

ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కనపర్తి మనోజ్ కుమార్, సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కే వీరారెడ్డి, శేషారెడ్డి, మాల్యాద్రి, రమణయ్య, నవీన్, పులి రామరాజు, బాలచంద్ర, నాని, వీరేంద్ర, బిట్టు, ప్రవీణు, నరసింహ, అంకమ్మరావు, రాయుడు, బిల్లా మహేష్ , మొదలైన వాళ్ళు పాల్గొన్నారు.