ప్రశ్నించడం మొదలు పెడితే నిర్బంధాలే

  • విద్యా వ్యవస్థను బాగుపరచడం కోసం పవన్ కళ్యాణ్ తెలంగాణలో పర్యటించాలి
  • తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్

హుస్నాబాద్: తెలంగాణాలో ఉన్నత విద్యను నిర్వీర్యం చెయ్యడానికి రాష్ట్ర సర్కార్ పూనుకున్నదని తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ నాయకులు చిట్టి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు. ఆయన ఆదివారం పత్రికా ముఖంగా మాట్లాడుతూ
ప్రైవేట్ బడి విద్యార్థుల ఫీజులలో 30% రాష్ట్రాన్ని పాలిస్తున్న నాయకుల అధికారుల చేతులకు వెళ్తున్నట్టు ఆధారాలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది కరువు ప్రభుత్వం అనుకొని చేస్తున్న మాయ. సరైన వసతులు, ఆధ్యపక బృందం లేకుంటే చచ్చినట్టు దారిద్రారేఖకు దిగువన వున్న కుటుంబం కూడా పిల్లల అభ్యున్నతి కోసం ఒళ్ళు గుల్ల చేసుకొని ప్రైవేట్ పాఠశాలలకు ఫీసు కడుతున్న విలువలు మరిచి ఆ ఫీజుల కోసం పిల్లలను, తల్లి తండ్రులను మనశ్శాంతి లేకుండా చేస్తుంది ఈ ప్రైవేట్ విద్యా వ్యవస్థ. మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తే మన వెనక వుండే అసలు నిజంగా కష్టపడుతున్న తల్లితండ్రులు రాకపోవడానికి కారణం నిత్య సమస్యలు. ఏదో ఒక కష్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి తీసుకొచ్చి నట్టింట్లో పెడితే అవి తీరడానికి, తీర్చడానికి పడుతున్న కష్టం ముందు స్వేచ్ఛా స్వతంత్రం కోసం ప్రశ్నించడం, పోరాడటం మరిచిపోయారు. ఎందుకంటే అతని వ్యక్తిగత బాధ్యత తీర్చుకొని అలసిపోతారు, కుటుంబ బాధ్యతలు ఉద్యమ ఆకాంక్షను చంపుతున్నాయి అందుకే మన పవన్ కళ్యాణ్ అన్న గారి సిద్దాంతాలు జనసేన పార్టీ ఆశయాలు 10 వసంతాలు ఐనా ప్రజల చెంతకు చేరలేదు. నిత్యావసర సరుకుల ధరలు. రవాణా వ్యవస్థ ఛార్జీలు. కరెంట్ చార్జీల భారం. గ్యాస్ బండ భారం. పెట్రోల్ వంట నూనె బారం. కూరగాయల ధరలు బారం. కమ్యూనికేషన్ వ్యవస్థ అలవాటు బారం. బడి ఫీజుల, పుస్తాకల, యూనిఫాం బారం. ఆరోగ్యం చూపించుకుని బాగుపడతాయి అంటే ఆస్తులు అమ్ముకోవలసిందే. ఆస్తులు లేని వారు మూగపోయి మూలకు ఉండిపోవడం భారం. చేస్తున్న పనికి సరైన పద్ధతిలో డబ్బులు ఇవ్వకపోవడంతో ( శ్రమ దోపిడీ ). బారం. ఇన్ని బారాలు మోసి ప్రశ్నించి ఉద్యమించమనడం మన ఆశ. చట్టాలు చేసే వ్యవస్థను మనం సరిగ్గా ఎంచుకొకపోతే మనకున్న అతి చిన్న హక్కును కూడా పొందలేము ఒక దేశాన్ని సమూలంగా నాశనం చెయ్యాలంటే గొప్ప గొప్ప యుద్ధం చెయ్యనవసరం లేదు. ఆ దేశ విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తే చాలు. అది నా తెలంగాణలో అమలుచేస్తున్న ప్రభుత్వాలను చూసి ఎలా వీరికి అడ్డుకట్ట వెయ్యాలి అనేది అవగతం చేసుకోవడం అవలంబించడం సాధ్యం అందుకు నా శక్తి సరిపోదు. ఈ సమస్యను గుర్తించి పోరాటం చేస్తున్న తెలంగాణ జనసేన పార్టీ నాయకులు ఇంకొంచెం ప్రయత్నం చేసి పవన్ కళ్యాణ్ అన్నతో 3 రోజులు తెలంగాణ పర్యటన అది ఒక విద్యా వ్యవస్థను బాగుపరచడం కోసం మాత్రమే, ఇది నా సొంత సమస్య కాదు. ఒక రాష్ట్ర విద్యా వ్యవస్థ పతనం… గ్రహించి మాట్లాడే వ్యక్తులు మాట్లాడకపోతే పవన్ కళ్యాణ్ అన్న గారు కలలు కన్న రేపటి బావితరం అంతర్యుద్ధం చెయ్యాల్సివస్తుంది. ఇది కేవలం మాట వరకు కాదు చూసి చెబుతున్న నిజం. సమాజ మార్పుకోసం ప్రయత్నించే వారికి శతకోటి శనార్తులు లని చిట్టి ఉదయ్ కుమార్ పేర్కొన్నారు.