వైసీపీ పార్టీ జెండా ఎగురవేయడాన్ని ఖండించిన దాసరి రాజు

ఇచ్చాపురం, గత 15 ఏళ్ల నుండి ఇచ్చాపురం మున్సిపాలిటీలో 9వ వార్డులో జాతీయజెండా ఎగురవేయడం ఆనవాయితీగా ఉంది. అలాంటిది ఈరోజు ఇచ్చాపురం వైసీపీ ఇంచార్జ్ పిరియా సాయిరాజు మరియు ఇచ్చాపురం వైసీపీ నాయకులు ఆ స్తూపంలో వైసీపీ పార్టీ జెండా ఎగురవేశారు. ప్రక్కన ఉన్న టీడీపీ జెండాని గౌరవించి జాతీయజెండా గౌరవించక ఆ స్థూపంలో వైసీపీ పార్టీ జెండా ఎగురవేయడం ఏంటి..? జాతీయ జెండాని కూడా గౌరవించరా…? ఆంద్రప్రదేశ్ ని కాస్తా వైసీపీ ప్రదేశ్ గా వైసీపీ జెండాని జాతీయ జెండాగా చేస్తారా. ఇంత వరకు ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొమ్ము కాజేశారు. ఇప్పుడు జాతీయ జెండాని వదలరా? వైసీపీ మీదే భక్తి ఎక్కువ దేశభక్తి కంటే మన వైసీపీ నాయకులకు దీనిపై మున్సిపల్ ఛైర్పర్సన్, వైసీపీ ఇంచార్జ్ సాయిరాజు వివరణ ఇవ్వాలి అని ఇచ్చాపురం జనసేన ఇంచార్జి దాసరి రాజు డిమాండ్ చేస్తున్నారు. మంత్రివర్యులు ధర్మాన ప్రసాదరావు మీకు చెప్పినట్టుగా 50 ఏళ్లు ముందుగా జగన్మోహన్ రెడ్డి పుట్టి ఉంటే బాగుందని మీరు కోరుకున్నారు. ఎందుకంటే ఇంకా భూ కబ్జాలు, మని లాండరింగ్ ఉండేది. అలానే ఆంద్రప్రదేశ్ ని అమ్మేసేవారు. ఈ విషయమై జనసేన ఇచ్చాపురం పార్టీ కార్యాలయం నుండి తీవ్రంగా ఖండిస్తున్నారు.