100 మిలియ‌న్ డోసుల వ్యాక్సీన్ త‌యారుచేయాల‌ని ఆదేశించిన బ్రిట‌న్ ప్రభుత్వం

ఆక్స్‌ఫర్డ్ యూనివ‌ర్సిటీ కరోనా మహమ్మారిని అంతమొందించేందుకు వ్యాక్సీన్ తయారీలో ముంద‌డుగు, రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బలపరిచి వ్యాధితో పోరాడటానికి టీకా సిద్ధం చేస్తున్న‌ ఆక్స్‌ఫర్డ్.

కరోనాకు వ్యాక్సీన్‌ త‌యారుచేసిన బ్రిట‌న్‌లోని ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ… వైర‌స్‌పై పోరాడేoదుకు మానవ శరీరంలోని రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను సిద్ధం చేస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. నిపుణులు కూడా ఇదే సుర‌క్షిత‌మ‌ని చెబుతున్నారు.

ఇప్పటివరకు ఈ వ్యాక్సీన్ 1077 మందికి ఎక్కించగా… వారిలో యాంటీబాడీలు, తెల్ల‌ర‌క్త క‌ణాలకు… క‌రోనావైర‌స్‌తో పోరాడే సామ‌ర్థ్యం వ‌చ్చిన‌ట్లు ప‌రిశోధ‌కులు గుర్తించారు.

ఈ ఫ‌లితాలు ప్ర‌పంచ దేశాల్లో ఆశ‌లు నింపుతున్నాయనడానికి ఏమాత్రం సందేహం లేదు. అయితే త‌గిన ర‌క్ష‌ణ క‌ల్పించ‌గ‌ల‌వా..? లేదా..? అని పూర్తిగా తెలుసుకునేందుకు మ‌రిన్ని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల్సి ఉండగా…

ఇప్ప‌టికే బ్రిట‌న్ ప్రభుత్వం ఇలాంటి 100 మిలియ‌న్ డోసుల వ్యాక్సీన్ త‌యారుచేయాల‌ని ఆదేశించినట్లు సమాచారం.