గాజువాక నియోజకవర్గంలో మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు

గాజువాక, పద్మ భూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా గాజువాక నియోజకవర్గం 75వార్డ్ జనసైనికుల ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు పెదగంట్యాడ జంక్షన్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మాజీ వైస్ చైర్మన్ జీఎంసీ మరియు జనసేన సీనియర్ నాయకులు కోన చినప్పారావు హాజరై చిరంజీవి ప్రజల కోసం చేసున్న సేవలను, అయన మంచితనాన్ని కొనియాడారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెగా సీనియర్ అభిమానులు వీరబాబు, మెగా నూకరాజు, కిల్లని ముసలయ్య, అంజూరి దీపక్, చోడిపిల్లి ముసలయ్య, జ్యోతి రెడ్డి, కిల్లని నాయుడు, చంటి, మహాలక్ష్మి, శంకరమ్మ, కోన శివ, నీలపు శ్రీనివాస్ రెడ్డి, అప్పలరెడ్డి, రాము తదితరులు పాల్గొని జనసేన పార్టీ తరుపున, మెగా అభిమానుల తరుపున శుభాకాంక్షలు తెలిపారు.