మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలకు హాజరైన కదిరి శ్రీకాంత్ రెడ్డి

తాడిపత్రి, వెండితెర ఇలవేల్పు తెలుగు సినిమా ఇండస్ట్రీ గాడ్ ఫాదర్ పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ చిరంజీవి 67వ పుట్టినరోజు వేడుకలను యాడికి మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. “మెగా అభిమానుల ఆత్మీయ కలయిక” పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా తాడిపత్రి నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. తమ అభిమాన నటుడైన చిరంజీవి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడానికి నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న పూర్వ చిరంజీవి అభిమానులందరూ కలిసి వచ్చారు మొదట వీరందరూ ప్రభుత్వాసుపత్రిలోని పేషెంట్లకు బ్రెడ్డు మరియు యాపిల్ పండ్లను పంచిపెట్టారు. తర్వాత స్థానిక ఈద్గా ఫంక్షన్లో కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ పూర్వ చిరంజీవి అభిమానుల పట్ల తమకెంతో గౌరవం ఉందని, వారందరూ కూడా తమతో కలిసి రావాలని పిలుపునిచ్చారు వారందరికీ జనసేన పార్టీలో ప్రత్యేక స్థానం కల్పిస్తామని తెలిపారు. చిరంజీవి లాంటి కల్మషం లేని నిస్వార్థ మనిషి ప్రజలకు ఏదో చేయాలని రాజకీయాల్లోకి వస్తే ఎన్నో కుతంత్రాలతో ఆయనను రాజకీయాల్లో నుండి వెళ్లిపోయేలా చేశారన్నారు. పార్టీని అమ్ముకోవాల్సిన అవసరం చిరంజీవికి లేదని ప్రతిఘటించారు. చిరంజీవి చేయదలచిన సామాజిక న్యాయం అంశాన్ని నిజం చేయాలనే ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారని పేర్కొన్నారు. కావున మెగా అభిమానులందరూ జనసేన పార్టీకి వెన్నుముకలా నిలవాలని కోరారు. చిరంజీవి అభిమానులే కాకుండా మెగా అభిమానులందరూ కూడా ఒక్కతాటిపైకి రావాలని జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి చిరంజీవి ఆశయాలను నిజం చేయాలనుకున్న పవన్ కళ్యాణ్ కి తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు. మెగా అభిమానులకు ఏ సమస్య వచ్చినా జనసేన పార్టీ తరఫున వెన్నుదన్నుగా నిలుస్తామని భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అభిమానుల కోసం ఏర్పాటు చేసిన విందు భోజనం కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక గాంధీ సర్కిల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా తాడిపత్రి పట్టణంలో మెగాస్టార్ చిరంజీవి 67 వ పుట్టినరోజు వేడుకలను పట్టణ రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆటో ప్రసాద్ మొక్కల పంపిణీతో ప్రారంభమై వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఈ రోజున సజ్జలదిన్నే ప్రభుత్వ పాఠశాలలో మొక్కలు నాటడం మరియు శ్రీకృష్ణ వృద్ధాశ్రమంలో వృద్ధులతో చిరంజీవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కటింగ్ చేసి పండ్లు, బ్రెడ్లు పంచిపెట్టారు. వృద్దులు చిరంజీవి గారి పట్ల తమ అభిమానాన్ని అభిమానులతో పంచుకున్నారు. అదే విధంగా జీవనాలయం లో మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మరియు తమ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా స్థానిక విజయలక్ష్మి సినిమా థియేటర్ నందు ఘారానమోగుడు చిత్రాన్ని ప్రదర్శించారు. సినిమా వీక్షిస్తూ అభిమానులు కేరింతలతో ఉత్సాహంగా చిరంజీవి పుట్టిన రోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. జనసేన పట్టణ అధ్యక్షుడు కుందుర్తి నరసింహా చారి, చిరంజీవి రాష్ట్ర యువత ఉపాధ్యక్షుడు కుమ్మెత ప్రతాప్ రెడ్డి, జనసేన పార్టీ కార్యక్రమాల కమిటీ సభ్యులు మాదినేని గోపాల్ , అచ్చుకట్ల అల్థాఫ్, నియోజకవర్గ జనసేన పార్టీ కార్యకర్తలు, మెగాస్టార్ చిరంజీవి అభిమానులు పాల్గొన్నారు.