భారత్‌ పర్యటనలో కెన్యా డిఫెన్స్‌ చీఫ్‌

కెన్యా రక్షణ దళాల చీఫ్ జనరల్ రాబర్ట్ కిబోచి రక్షణ మంత్రిత్వ శాఖ ఆహ్వానం మేరకు సోమవారం భారత్‌కు వచ్చారు.  ఇండియా వచ్చిన రాబర్ట్ కిబోచి ఐదు రోజుల పాటు దేశంలో పర్యటిస్తారు. తొలుత ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నారావణేతో జనరల్ రాబర్ట్ కిబోచి సోమవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకారం అంశాలపై వారిద్దరు చర్చించారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, జాతీయ భద్రతా సలహారుడు అజిత్ దోవల్‌తోపాటు విదేశాంగశాఖ అధికారులతోనూ ఆయన సమావేశంకానున్నారు. ఈ ఏడాది ఆరంభంలో కెన్యా రక్షణ దళాల చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన రాబర్ట్ కిబోచి ఆఫ్రికా వెలుపల సందర్శించే తొలి దేశం భారత్‌ కావడం విశేషం.